Vishal Health Condition: హీరో విశాల్ ఆరోగ్యం బాగానే ఉందా.. అసలేమైంది అతనికి?

స్టార్ హీరో విశాల్ (Vishal) ఆరోగ్య పరిస్థితిపై సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా చర్చ నడుస్తోంది. ఆదివారం జనవరి 5న జరిగిన మధగజ రాజా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విశాల్ హాజరయ్యారు. అక్కడ విశాల్ నడుస్తున్నప్పుడు సహాయకుడి మద్దతు తీసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.

అంతేకాకుండా విశాల్ మాట్లాడేటపుడు చేతులు వణుకుపోతుండటం అందరినీ షాక్ కలిగించింది. అయితే, కొన్నిరోజులుగా విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని కొన్ని నివేదికలు సూచిస్తున్నప్పటికీ.. అతని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సందేహం నెలకొంది. దీంతో అసలు విశాల్కి ఏమై ఉంటుంది? ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయారు? అని సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : ప్రముఖ స్టార్ హీరోకి బ్రెయిన్‌ సర్జరీ

అయితే, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన సినిమాని ప్రమోట్ చేయడానికి విశాల్ చేసిన ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకుంది. అతనికి సినిమాపై ఎంతటి కమిట్‌మెంట్ ఉందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది.దాంతో తన అభిమానులు విశాల్ చేసిన ఈ ప్రయత్నం పట్ల గర్వపడుతున్నాం అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. అయితే, విశాల్ ఆరోగ్య పరిస్థితిపై సినీ వర్గాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

మధగజ రాజా సినిమా:

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మధగజ రాజా సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో విశాల్ సరసం అంజలి నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించింది.

అయితే, ఈ చిత్రం 2012లో నిర్మాణాన్ని ప్రారంభించి 2013 నాటికి షూటింగ్ పూర్తిచేసుకుంది.కానీ, ఆర్థిక సమస్యల కారణంగా 12 ఏళ్లు గడిచిన విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే ఎట్టకేలకు ఈ సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలోకి రానుంది.