డిండి నుంచి నీటి విడుదల నిలిపివేత

డిండి, వెలుగు : డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చెరువులు, కుంటలకు విడుదల చేస్తున్న నీటిని శుక్రవారం నిలిపివేశారు. వేసవి దృష్ట్యా డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నల్గొండ జిల్లా డిండి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లోని చెరువులకు 24 రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.

 ప్రస్తుతం డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 26.3 అడుగుల మేర 1.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నింపామని, కాల్వలకు రిపేర్లు చేసిన అనంతరం అవసరమైతే మరోసారి నీటిని విడుదల చేస్తామని ఏఈ ఫయాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.