ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోనే సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి

  • ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం

గద్వాల, వెలుగు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల టౌన్ ఎస్సై కళ్యాణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల పట్టణానికి చెందిన అశోక్‌‌‌‌‌‌‌‌ (40), వీరావతి భార్యభర్తలు. ఇద్దరూ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోనే సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. డ్యూటీ ఉందంటూ బుధవారం సాయంత్రం అశోక్‌‌‌‌‌‌‌‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అక్కడి నుంచి కేఎల్‌‌‌‌‌‌‌‌ఐలో ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ -1 ఆఫీస్‌‌‌‌‌‌‌‌కి చేరుకున్నాడు. 

లోపలికి వెళ్లిన అశోక్‌‌‌‌‌‌‌‌ తన వెంట తెచ్చుకున్న చున్నీతో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి అయినా అశోక్‌‌‌‌‌‌‌‌ ఇంటికి రాకపోవడంతో అతడి భార్య వీరావతి ఫోన్‌‌‌‌‌‌‌‌ చేయగా స్విచ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అని వచ్చింది. గురువారం ఉదయం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ అటెండర్ వచ్చి చూడగా అశోక్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌ విషయం వెలుగుచూసింది. మృతుడి భార్య వీరావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధే అశోక్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.