ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి IRDAI(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ) ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం “ఆరోగ్య సంజీవని” , కొవిడ్-19 బీమా పథకాలు విజయవంతమైన తర్వాత ఐఆర్డీఏఐ.. “సరళ్ జీవన్ బీమా” అనే ప్రామాణిక జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇది సమగ్ర రక్షణను అందించే బీమా పథకమని ఐఆర్డీఏఐ పేర్కొంది.
ఈ పథకం కింద కవరేజీ రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. భారతదేశంలోని మొత్తం 24 లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ స్టాండర్డ్ టర్మ్ పాలసీని అందించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. జనవరి 1, 2021 సంవత్సరం లోపల అన్ని బీమా సంస్థలు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.
సరళ్ జీవన్ బీమా అనేది పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ ను పోలి ఉంటుంది. ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి తీసుకున్నా ‘సరళ్ జీవన్ బీమా’ పాలసీ నియమనిబంధనలు, బెనిఫిట్స్ ఒకేలా ఉంటాయి. ఇది రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. అంటే ఈ పాలసీ తీసుకున్నవారు మరణిస్తేనే నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి. ఆత్మహత్య చేసుకొని మరణిస్తే పాలసీ వర్తించదు. కనీసం 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ గడువు 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ గడువు గరిష్టంగా 70 ఏళ్లు. ఈ బీమా పథకం కింద ఒక వ్యక్తి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కవరేజీ పొందవచ్చు. బీమా పథకాన్ని లింగం, నివాస స్థలం, వృత్తి లేదా విద్య అర్హతలపై పరిమితులు లేకుండా అందరికీ అందించాలని ఐఆర్డీఏఐ పేర్కొంది.
సరళ్ జీనవ్ బీమా యొక్క ఫీచర్లు (నవల్ గోయల్ – సీఈవో, PolicyX.com))
● సరళ్ జీవన్ బీమా అనేది ఒక వ్యక్తిగత నెట్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు మరణించినప్పుడు నామినీకి ఒకే మొత్తాన్ని చెల్లిస్తుంది.
● పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి కవరేజీ లభించదు.
● పాలసీ కొనుగోలు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 65 సంవత్సరాలు. పాలసీ కాల వ్యవధి నాలుగు సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు
● పాలసీదారుడు రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు బీమా మొత్తాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
● ఈ పాలసీ కింద మూడు ప్రీమియం చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు. అవి రెగ్యులర్ ప్రీమియం, పరిమితి ప్రీమియం చెల్లింపు 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాలు మరియు సింగిల్ ప్రీమియం చెల్లింపు.
ఈ పథకం అందించబడే డెత్ బెనిఫిట్ ప్రయోజనాలు
● సింగిల్ ప్రీమియం పాలసీకి డెత్ బెనిఫిట్ 125 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.
● ఈ పాలసీ కింద ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనం అందించబడుదు.
● పాలసీ ప్రారంభం నుంచి 45 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఈ కాల వ్యవధిలో పాలసీ దారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కవరేజీ లభిస్తుంది.
