ఇండియాలో రైళ్లకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ప్రయాణానికి పదిహేను రోజుల ముందు టిక్కెట్ బుక్ చేసుకున్నా ఒక్కోసారి బెర్త్కన్ ఫామ్ కాదు. తత్కాల్ బుకింగ్ లాంటి ఆప్షన్లుఉన్నా.. పేమెంట్ గేట్‌వేలో ఉన్న సమస్యలతో టిక్కెట్లు బుక్ కావడం లేదు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ఓ స్పెషల్ ఫీచర్‌ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ‘బుక్ నౌ, పే లేటర్’ సర్వీసును ఆఫర్చేస్తుంది. ఈ సర్వీసు ద్వారా ‘ఈపే లేటర్’ ఆప్షన్ తో తేలికగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్చేసుకోవచ్చు.
‘ఈపే లేటర్’ సర్వీసు రిజర్వేషన్ టిక్కెట్లకు, తత్కాల్ టిక్కెట్లకు రెండింటి కి అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ ను ముఖ్యంగా తత్కాల్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి పేమెంట్గేట్‌వేలో వస్తోన్న సమస్యల పరిష్కారం కోసం తెచ్చారు . ఇప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుని,తర్వాత చెల్లింపు చేయొచ్చు. ఈ పే లేటర్ ద్వారా ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టిక్కెట్లను బుక్ చేసుకుని, 14 రోజుల లోపల టిక్కెట్ ఛార్జీలను ప్యాసెంజర్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్థ శస్త్రఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీసుకు డిజిటల్పేమెంట్ సొల్యు షన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఒకవేళ14 రోజుల లోపల బుక్ చేసుకున్న టిక్కెట్ ఛార్జీలను చెల్లించలేకపోతే, పన్నులతో పాటు 3.50శాతం వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఈపే లేటర్’ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడమెలా..?
ఐఆర్ సీటీసీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. టిక్కెట్ బుక్ చేసుకోవడానికి జర్నీ వివరాలివ్వాలి. పేమెంట్ పేజీలో,‘పే లేటర్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ‘పే లేటర్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే, ‘ఈపే లేటర్ ’ కు మీరు రీ డైరెక్ట్ అవుతారు. రిజిస్టర్ డ్ మొబైల్ నెంబర్ తో ‘ఈపే లేటర్’ వెబ్ సైట్ లోకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక, మీరు సక్సెస్ ఫుల్‌గా లాగిన్ అయినట్టే.బుకింగ్ అమౌంట్ ని కన్‌ఫామ్ చేస్తే, మీ టిక్కెట్ బుకైపోతుంది.

