IRCTC సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్

రైలు ప్రయాణికులకు బిగ్ అలెర్ట్ అందుతోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) మొబైల్ యాప్ మరియు వెబ్‌సైట్ సేవల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. దాంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదు. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు.

టికెట్లు బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ తెరిచిన వారికి.. సైట్ మెయింటెనెన్స్ కారణంగా ఈ-టికెటింగ్ సేవ అందుబాటులో లేవనే సందేశం డిస్‌ప్లే అవుతున్నట్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.  

"ప్రస్తుతానికి IRCTC వెబ్‌సైట్ పని చేయడం లేదు. సైట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ఈ-టికెటింగ్ సేవ అందుబాటులో ఉండవు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. టికెట్ల రద్దు, TDR ఫైల్ కోసం దయచేసి కస్టమర్ కేర్ నంబర్‌కి కాల్ చేయండి. 14646, 08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.inకి మెయిల్ చేయండి.." అని మెసేజ్ డిస్‌ప్లే అవుతోంది.

స్పందించని IRCTC

సేవల్లో అంతరాయానికి సంబంధించి IRCTC నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దాంతో,  IRCTC నుంచి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల రైలు టికెట్ల బుకింగ్ కోసం వేచిచూస్తున్నప్రయాణీకుల్లో ఆందోళన నెలకొంది.