ట్రైన్ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి..తరువాతే పైసలివ్వండి

ట్రైన్ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి..తరువాతే పైసలివ్వండి

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సంక్రాంతి పండుగ కోసం ఊరెళ్లేందుకు టికెట్ల కోసం రైల్వే స్టేషన్ లో పడిగాపులు కాస్తున్నారా..? పండక్కి ఊరెళ్లాలని ఉన్నా మీ దగ్గర డబ్బులు లేవా..? మరేం పర్లేదు.

రైల్వే ప్రయాణికులకు కోసం ఐఆర్ సీటీసీ “ఇపే లేటర్” సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యం వల్ల మీ దగ్గర డబ్బులు లేకున్నా..టికెట్ బుక్ చేసుకొని హాయిగా ప్రయాణించవచ్చు. అర్ధశాస్త్ర ఫిన్ టెక్ ప్రెవేట్ లిమిటెడ్, అండూరిల్ టెక్నాలజీస్ పే ఆన్ డెలివరీ ద్వారా టికెట్లను పొందవచ్చు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు 14రోజుల తరువాత చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అదనపు ఛార్జీలు కూడా లేవు. పైగా పెద్దమొత్తంలో టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా గిఫ్ట్ ఓచర్లను సొంతం చేసుకోవచ్చు. ఇపే లేటర్ ద్వారా  20వేలు క్రెడిట్ పొందవచ్చు. 14రోజుల తరువాత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.