ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈశ్వరన్ సెంచరీ

లక్నో : ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైకి రెస్టాఫ్​ ఇండియా జట్టు దీటుగా బదులిస్తోంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్ స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై 537 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటవగా..  మూడో రోజు, గురువారం ఆట చివరకు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు 289/4 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్ (9) నిరాశ పరిచినా.

మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (151 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ (32), దేవదత్ పడిక్కల్ (16), ఇషాన్ కిషన్ (38), ధ్రువ్ జురెల్ (30 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫర్వాలేదనిపించారు. ముంబై స్కోరుకు రెస్ట్ ఇంకా 248 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరంలో ఉంది.

ALSO READ | విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా శుభారంభం