స్నాప్ డ్రాగన్ జెన్ 2 తో రాబోతున్న మొదటి ఫోన్

స్నాప్ డ్రాగన్ జెన్ 2 తో రాబోతున్న మొదటి  ఫోన్

ఐక్యూ కంపెనీ నుంచి ఐక్యూ 11 మొబైల్ రాబోతుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో లాంచ్ అవబోతుంది. అయితే, ఇండియాలో ఈ ప్రాసెసర్ తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. అంటే ప్రస్తుతం భారత్ లో ఉన్న అత్యంత ఫాస్టెస్ట్ మొబైల్ ఇదేనన్న మాట. ఈ ప్రాసెసర్ వల్ల సీపీయూ పర్ఫామెన్స్ లో 10శాతం, జీపీయూలో 20 శాతం ఇంప్రూమెంట్ ఉంటుంది. 

అంతేకాకుండా ఇందులో వీ2  అనే రెండవ చిప్ ఉండటం వల్ల మెయిన్ ప్రాసెసర్ పై  ప్రెజర్ పడే అవకాశం ఉండదు. పవర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. గేమింగ్, గ్రాఫిక్, కెమెరా పరంగా బెటర్ పర్ఫామెన్స్ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. బీఎండబ్ల్యూ  ఎం స్పోర్ట్స్ డిజైన్ లో ఉంటుంది. ఈ ఫోన్ జనవరి 10, 2023 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.