ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌‌‌‌ 31వ తేదీలోగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలి. 

అర్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ్‌‌‌‌ డాక్‌‌‌‌ సేవక్‌‌‌‌ (జీడీఎస్‌‌‌‌) ఉద్యోగిగా కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 1 సెప్టెంబర్​ 2024 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్ : డిగ్రీ మార్కులు, ఆన్‌‌‌‌లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అక్టోబర్​ 31 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.750 చెల్లించాలి. పూర్తి వివరాలకు  www.ippbonline.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.

ALSO READ | డిగ్రీతో ఎన్‌‌‌‌టీపీసీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్​