IPL 2025: ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

అభిమానులు ఎంతగానో ఎదరు చూస్తున్న ఐపీఎల్ 2025 రిటైన్ చేసుకునే ప్లేయర్ల సమయం దగ్గర పడుతుంది. 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై అన్ని ఫ్రాంఛైజీలు బిజీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సహా మొత్తం 10 జట్లు అక్టోబర్ 31 నాటికి రిటెన్షన్ జాబితాను షార్ట్‌లిస్ట్ చేయాలి.

నవంబర్ చివరి వారంలో జరగనున్నఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అందరు ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ లాంటి స్టార్ ఆటగాళ్లపై సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కు రూ. 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.   
 
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

ఐపీఎల్ 2025 రిటెన్షన్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ వీక్షించవచ్చు. అక్టోబరు 31 (గురువారం) సాయంత్రం 5 గంటలలోపు ప్రతి జట్టు తమ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి. సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. స్టార్‌టీమ్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ రిటైన్డ్ ప్లేయర్‌ల జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు.