IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా మునాఫ్‌ పటేల్‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్‌‌ మునాఫ్‌ పటేల్‌ ఐపీఎల్‌ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. 41 ఏండ్ల మునాఫ్‌ ఢిల్లీ హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీ, డైరెక్టర్ ఆఫ్ ​క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పనిచేయనున్నాడు. 2018లో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైరైన మునాఫ్‌ తన కెరీర్‌‌లో తొలిసారి హై ప్రొఫైల్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపడుతున్నాడు. మునాఫ్ ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో 86 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్ (2008), ముంబై ఇండియన్స్ (2013)కు ప్రాతినిథ్యం వహించాడు.