ఐపీఎల్ మెగా వేలానికి 1574 మంది ఆటగాళ్లు

ఐపీఎల్ మెగా వేలానికి 1574 మంది ఆటగాళ్లు

-మెగా వేలానికి 1,574 మంది
-1,165 మంది ఇండియన్స్‌‌‌‌
-16 దేశాల నుంచి 409 మంది ఫారిన్ ప్లేయర్లు
-ఈ నెల 24, 25న జెడ్డాలో ఐపీఎల్ వేలం

ముంబై:  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 2025 సీజన్ కోసం జరిగే మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలానికి రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో  ముగియగా..  1,165  మంది ఇండియా ప్లేయర్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ సెక్రటరీ జైషా మంగళవారం ప్రకటించారు. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని  జెడ్డాలో వేలం జరుగుతుందని తెలిపారు.

వేలానికి రిజిస్టర్ అయిన వారిలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224  మంది అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా నుంచి 48 మంది క్యాప్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఉండగా.. క్యాప్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్లు 272 మంది బరిలో నిలిచారు. అన్‌‌‌‌‌‌‌‌క్యాప్డ్ ప్లేయర్లలో 965 మంది ఇండియాకు చెందిన వాళ్లు కాగా.. మరో 104 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  ఇండియా కాకుండా 16 దేశాల ఆటగాళ్లు వేలానికి వస్తున్నారు.

ఇందులో సౌతాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది రిజిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా (76), ఇంగ్లండ్ (52) నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి అమెరికా నుంచి పది మంది బరిలో నిలవగా.. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్ రిజిస్టర్ చేసుకున్నారు. స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇద్దరు,   కెనడా నుంచి నలుగురు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.పది ఫ్రాంచైజీల్లో కలిపి 204 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70 స్లాట్స్‌‌‌‌ ఫారిన్ ప్లేయర్లకు కేటాయించారు.