IPL 2025 Mega Auction: జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. బరిలో 1574 మంది ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలం అబాడి అల్ జోహార్ అరేనా వేదికగా జరగనుండగా.. ఫ్రాంచైజీల యజమానులు, అధికారులు హోటల్ షాంగ్రి-లాలో బస చేయనున్నారు. ముందుగా ఈ మెగా ఈవెంట్‌ను రియాద్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో వేదిక మార్చారు. 

వేలంలో మొత్తం 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు కాగా.. మిగిలిన 409 మంది ఓవర్సీస్(విదేశీ) ప్లేయర్లు. ఇందులో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు.. 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

ఏ దేశం వారు ఎంతమంది ఉన్నారంటే..?

  • దక్షిణాఫ్రికా: 91
  • ఆస్ట్రేలియా: 76
  • ఇంగ్లండ్‌:  52
  • న్యూజిలాండ్‌: 39 
  • శ్రీలంక: 29 
  • ఆఫ్ఘనిస్థాన్‌: 29
  • వెస్టిండీస్‌: 33
  • బంగ్లాదేశ్:13
  • కెనడా: 4
  • ఐర్లాండ్: 9
  • ఇటలీ: 1
  • నెదర్లాండ్స్: 12
  • స్కాట్లాండ్: 2
  • యూఏఈ: 1
  • యూఎస్ఏ: 10
  • జింబాబ్వే: 8

కాగా, ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను వెల్లడించాయి. మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకోగా, ఇందులో పది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిపై అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.558.5 కోట్లు ఖర్చు చేశాయి.