IPL 2025 Mega Action: ఆర్‌సీబీ చెంతకు స్వింగ్ కింగ్.. ఏకంగా రూ.10.75 కోట్లు

భారత వెటరన్ పేసర్, స్వింగ్ కింగ్ భువేశనేశ్వర్ కుమార్ రూ.10.75 కోట్ల ధర పలికాడు. కనీస ధర రూ. రూ.2 కోట్లతో వేలంలోకి వచ్సిన భువీ కోసం ముంబై, లక్నో పోటీపడ్డాయి. ధర రూ. 10 కోట్లు పైబడగానే ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనూహ్యంగా అతన్ని చేజిక్కించుకుంది. భువీ రాకతో ఆర్‌సీబీ బౌలింగ్ కాస్త మెరుగు పడింది. 

మరోవైపు, మెగా వేలంలో ఆర్‌సీబీ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. అవసరమైన ఆటగాడిని వదిలేసుకోవడం, అనవసరమైన ప్లేయర్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం చేస్తోంది. ఆ జట్టు అభిమానులు.. యాజమాన్య వ్యూహాలపై గుర్రుగా ఉన్నారు.

Also Read : వేలంలో భారత ఓపెనర్లకు నిరాశ

ఆర్‌సీబీ ఇప్పటివరకు కొనుగోలు చేసిన ప్లేయర్లు

  • భువనేశ్వర్ (ఫాస్ట్ బౌలర్): రూ. 10.75 కోట్లు
  • కృనాల్ పాండ్యా (స్పిన్ ఆల్ రౌండర్): రూ. 5.75 కోట్లు
  • జితేష్ శర్మ(వికెట్ కీపర్): రూ.11 కోట్లు
  • ఫిల్ సాల్ట్(ఓపెనర్/ వికెట్ కీపర్, ఇంగ్లండ్): రూ.11.5 కోట్లు
  • మిచెల్ మార్ష్(ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా): రూ.3. 4 కోట్లు
  • జోష్ హాజిల్‌వుడ్ (ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా): రూ. 12.50 కోట్లు
  • లియామ్ లివింగ్‌స్టోన్(స్పిన్ ఆల్ రౌండర్, ఇంగ్లండ్) : రూ.8.75 కోట్లు