PL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఇప్పటివరకూ అమ్ముడుపోయిన ఆటగాళ్లు

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2025 మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. తమకు కావాల్సిన ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీ‎లు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన వేలం ప్రకారం, భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉన్నాడు.

ఇప్పటివరకూ కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు

  • రిషబ్ పంత్: రూ. 27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
  • శ్రేయాస్ అయ్యర్: రూ. 26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • అర్షదీప్ సింగ్: రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్- RTM)
  • యుజ్వేంద్ర చాహల్: రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • జోస్ బట్లర్: రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్) 
  • కేఎల్ రాహుల్: రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) 
  • మహ్మద్ సిరాజ్: రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్) 
  • మిచెల్ స్టార్క్: రూ.11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • కగిసో రబడ: రూ.10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • మహ్మద్ షమీ: రూ.10.00 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
  • లియామ్ లివింగ్‌స్టోన్: రూ.8.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
  • డేవిడ్ మిల్లర్: రూ.7.50 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)