ఐపీఎల్ 15 సీజన్ లో కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్ లు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జాయింట్ గుజరాత్ టైటాన్స్ కు 159 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్ డకౌట్, క్వింటాన్ డికాక్ 7 పరుగులతో నిరాశ పరిచారు. దీపక్ హుడా 55, అయూష్ 54, కృనాల్ పాండ్యా 21 మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన లక్నో 158 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వరుణ్ అరోన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
