సిద్దిపేటలో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

  • సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, వీడియో గ్రాఫర్లకు షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నట్లు సోమవారం సీపీ అనురాధ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా తీసిన 3 ఫొటోలతో పాటు

3 నిమిషాల షార్ట్ ఫిలిమ్స్ తీసి ఈ నెల 20లోపు సీపీ ఆఫీస్ లో అందజేయాలన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తీసినవి మాత్రమే పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440379237 ను సంప్రదించాలన్నారు. జిల్లాస్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ గా నిలిచిన వాటిని రాష్ట్రస్థాయి కాంపిటీషన్ కు పంపిస్తామని  తెలిపారు.