నవరాత్రి ఉత్సవాలకు ఏపీ కలెక్టర్, డీఐజీకి ఆహ్వానం

అలంపూర్, వెలుగు : అలంపూర్ జోగుళాంబ దేవి శరన్నవరాత్రులకు ఏపీలోని కర్నూలు కలెక్టర్​ రంజిత్ బాషాకు, కర్నూల్​ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు జోగులాంబ దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానం అందించారు.  ఈఓ పురేందర్ కుమార్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ , సీనియర్ అసిస్టెంట్ శేఖర్ కర్నూలులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిశారు. 

అక్టోబరు 3 నుంచి 12 వరకు ఉత్సవాలు జరుగుతాయిన చెప్పారు. ఏటా ఏపీ ప్రభుత్వం నుంచి అమ్మవారికి కలెక్టరు చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ను ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.