ఎస్పీ ఆధ్వర్యంలో పట్నం నరేందర్ రెడ్డి విచారణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. బుధవారం ఉదయాన్నే పోలీసులు ఆయన్ని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్లపై దాడి చేసిన ఘనటలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. బుధవారం ఉదయం 6గంటలకు కేబీఆర్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. 

 వికారాబాద్ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలవడానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి, వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. మెతుకు ఆనంద్, మహేశ్వరెడ్డిలను పోలీసులు లోనికి అనుమతించారు.

పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు భోగమోని సురేష్ అధికారులను గ్రామంలోకి తీసుకెళ్లారు. అప్పుడే గ్రామస్తులు ఫార్మాసిటీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లారు. ఈక్రమంలో గ్రామస్థులు ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు. దాడి ఘటనలో కీలక వ్యక్తి భోగమోని సురేష్ తో చాలా సార్లు పట్నం నరేందర్ ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ప్రస్తుతం భోగమోని సురేష్ పరారీలో ఉన్నాడు.