‘స్వచ్ సోచ్’ ఎన్జీఓ లోగో ఆవిష్కరణ

బషీర్ బాగ్ వెలుగు: ‘స్వచ్ సోచ్’ అనే ఎన్జీఓ లోగోను రవీంద్రభారతిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్, అంబేద్కర్ వాది జేబీ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ ఫౌండర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వచ్ సోచ్​ద్వారా ప్రభుత్వ పథకాలు అందరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తామన్నారు. పేద విద్యార్థులకు అనాథలకు అండగా ఉంటామని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ సోచ్ అధ్యక్షురాలు సాజిద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, జనరల్ సెక్రెటరీ వెంకటేశ్ గౌడ్, సభ్యుడు రామేశ్వర్ పాల్గొన్నారు.