- సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
- స్టూడెంట్లతో కలిసి సహపంక్తి భోజనం
హైదరాబాద్‌సిటీ/అబ్దుల్లాపూర్ మెట్/ఘట్కేసర్/ముషీరాబాద్/ఇబ్రహీంపట్నం/వికారాబాద్/శామీర్ పేట/సికింద్రాబాద్, వెలుగు : గ్రేటర్‌పరిధిలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మెనూను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా ప్రాంతాల్లోని హాస్టళ్లను సందర్శించారు. స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని ఎల్బీనగర్జోన్మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాన్ని రాచకొండ సీపీ సుధీర్‌బాబు, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బీసీ గురుకులాన్ని ఉన్నత విద్యామండలి కమిషనర్ దేవసేన, ముషీరాబాద్, చార్మినార్ ఎంజేపీ గురుకులాలను ఏఐఎస్ ఆఫీసర్సర్ఫరాజ్ పరిశీలించారు.
హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ కోట శ్రీవత్స ముషీరాబాద్, హయత్‌నగర్‌లోని బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించారు. స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. ఘట్కేసర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ను మేడ్చల్‌జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. ఆయనతో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ కుమార్, ఘట్కేసర్ తహసీల్దార్ ఉన్నారు. బోడుప్పల్‌లోని గురుకులాన్ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి సందర్శించారు. కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను సిటీ సీపీ సీవీ ఆనంద్ సందర్శించారు.
ఆయన వెంట సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చల్ల దేవి, ప్రిన్సిపల్ వాణిశ్రీ ఉన్నారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని గురుకులాలను పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. చర్లపటేల్ గూడలోని గురుకులంలోని స్టూడెంట్లతో కలిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ భోజనం చేశారు. వినోభా నగర్ లోని గురుకులాన్ని సీనియర్ఐఏఎస్ ఆఫీసర్శశాంక్ గోయల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సందర్శించారు. వికారాబాద్ జిల్లా ఎన్నపల్లి చౌరస్తాలోని టీజీఎంఆర్జేసీ స్కూల్, జూనియర్ కాలేజీలోని స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్ భోజనం చేశారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు.
శామీర్‌పేట జగన్ గూడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను రాచకొండ డీసీపీ పద్మజారెడ్డి సందర్శించారు. గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్మొజంజాహి మార్కెట్సమీపంలోనే వెల్ఫేర్హాస్టల్ను, ముషీరాబాద్ఎమ్మెల్యే ముఠా గోపాల్ అడ్డగుట్ట సోషల్వెల్ఫేర్గర్ల్స్హాస్టల్, జమిస్తాన్పూర్హాస్టల్ను, ఎంఐఎం ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టల్స్ విజిట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కంటోన్మెంట్ లోని మైనారిటీ గురుకులాన్ని పరిశీలించారు.