అప్పటి దాకా ఏపీతో ఒప్పందం ఉండదు
పాత పద్ధతిలోనే నడపాలని భావిస్తున్న ఏపీ ఆర్టీసీ
రేపు రెండు రాష్ట్రా ల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులకు ఒప్పం దం కొలిక్కి రావడం లేదు. ఏపీ ఆర్టీసీ అధికారులు ఒకటి చెబుతుం డగా, టీఎస్ ఆర్టీసీ అధికారులు మాత్రం మరొకటి అంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన భేటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బుధవారం మరోసారి హైదరాబా-ద్ లో ని బస్ భవన్ లో భేటీ కానున్నారు. మంగళవార మే సమావేశం కావాల్సి ఉండగా, ఏపీ అధికారులు ఒక రోజు వాయిదా కోరినట్లు తెలిసింది. ఈ భేటీ సందర్భంగా ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మతో కూడా ఏపీ అధికారులు చర్చించనున్నట్లు తెలిసింది. ఇంటర్ స్టేట్ సర్వీసులపై ముమ్మర కసరత్తు చేసిన అధికారు-లు.. ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు. మేము ఎన్ని కి.మీ.నడిపితే.. ఏపీ అంతే నడపాలి ‘రెం డు రాష్ట్రాల మధ్య తెలంగాణ బస్సుల కంటే ఏపీ బస్సులను ఎక్కువగా తిప్పుతున్నారు. వారి బస్సులే ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయి. మనం 722 బస్సులను తిప్పుతుంటే .. ఏపీ వాళ్లు 1,006 బస్సులను నడుపుతున్నారు. మన కంటే లక్ష కిలోమీటర్లు ఎక్కువగా ఏపీ వాళ్లు తిప్పుతున్నా-రు. ఫలితంగా తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నే మనం ఎన్ని కిలోమీటర్లు తిప్పి తే.. ఏపీ కూడా అంతే నడపాలి. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. అప్పటి దాకా అంతర్రాష్ట్ర ఒప్పందమే ఉండదు. వాళ్లే దిగిరావాలి’ అని ఓ ఉన్నతాధి కారి చెప్పారు. ఇటీవల విజయవాడలో జరిగిన భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఏపీ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి మాత్రం నాలుగు దశల్లో బస్సులను నడుపుతామన్నాని, ఫస్ట్ ఫేజ్‌లో 256 బస్సులను నడిపిస్తామన్నారు. ఈ లెక్కన చూసుకుంటే మళ్లీ 1,000 బస్సులను దాటే అవకాశం ఉంటుం దని, దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉన్నతాధికారి చెప్పారు.
