‌‌డేటా స్పీడ్ పెరగాలంటే

‌‌డేటా స్పీడ్ పెరగాలంటే

ఇంటర్నెట్​ యూజర్ల కోసం ఐదో జనరేషన్ మొబైల్​ నెట్ వర్క్ వచ్చింది. అది ఇప్పుడు మనదేశంలో బాగానే వాడుతున్నారు. 4జీ కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ స్పీడ్ ఉంటుంది 5జీ. అయినప్పటికీ 5జీ ఇంటర్నెట్​ కూడా నెమ్మదిగా ఉంటోంది అని చాలామందికి కంప్లయింట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు డేటా స్పీడ్​ పెరగడానికి ఈ టెక్ టిప్స్​ పాటిస్తే సరి. అవేంటంటే.. 

 మొదట 5జీ నెట్​వర్క్​కి కనెక్ట్​ అయిందా? లేదా? అనేది చెక్ చేయాలి. ఫోన్​లో సెట్టింగ్స్​ ఓపెన్ చేసి, అందులో సెల్యులార్ డేటా ఆప్షన్​ కింద ఫోన్ కనెక్ట్​ అయిన నెట్​వర్క్​ల లిస్ట్​ను చెక్ చేయాలి.

 డేటా ఆన్​ కాకపోయినా, స్లోగా ఉన్నా ఫోన్​ని రీస్టార్ట్​ చేయాలి. అలా చేస్తే మొబైల్ డేటా ఆన్​ అవడంతోపాటు ఇంటర్నెట్​ స్పీడ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫోన్​ని రీస్టార్ట్​ చేసేందుకు పవర్​ ఆఫ్​ స్లైడర్ కనిపించే వరకు బటన్​ నొక్కి ఉంచాలి. పవర్​ ఆఫ్​ స్లైడర్​ను కుడివైపుకి డ్రాగ్​ చేయాలి. తర్వాత ఒక నిమిషం ఆగి, ఫోన్​ని ఆన్​ చేయాలి. 

  బ్యాక్​గ్రౌండ్​లో చాలా యాప్​లు ఓపెన్​ అయి ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అవుతుంది. అందుకని యాప్​లని ఫోర్స్​గా క్లోజ్ చేయాలి. యాప్​ స్విచ్చర్​ని ఓపెన్​ చేసి, ఐఫోన్​లో హోమ్​ బటన్​ను రెండుసార్లు క్లిక్ చేయాలి. లేదా ఆండ్రాయిడ్​ ఫోన్​లో అయితే, స్క్రీన్​ కింద నుంచి పైకి స్వైప్​ చేయాలి. అంతకంటే ముందు అవసరం లేని యాప్​లను కూడా స్వైప్ చేయాలి. 

   రీసెంట్​గా చూసిన వెబ్​సైట్​లు, యాప్​ల నుంచి డేటాను ఫోన్​ స్టోర్​ చేస్తుంది. ఫోన్​ స్పేస్ ఆక్రమించి, ఫోన్​ స్లో అయ్యేలా చేస్తుంది. అలాంటప్పుడు Cache(క్యాచి) క్లియర్​ చేసేందుకు సెట్టింగ్స్​ యాప్​ ఓపెన్​ చేసి, General​ >  Storage & iCloud Usage > ​ మేనేజ్​మెంట్​ స్టోరేజ్​కి వెళ్లి Cache క్లియర్ చేయాలనుకునే యాప్​పై నొక్కాలి. ఆ తర్వాత Clear Cache ఆప్షన్​ నొక్కాలి. 

    కొత్త ఫీచర్లు, బగ్ సొల్యూషన్స్​తో ఫోన్ సాఫ్ట్​వేర్​ ఎప్పటికప్పుడు అప్​డేట్​ అవుతుంది. సాఫ్ట్​వేర్​ లేటెస్ట్​ వెర్షన్​ లేకుంటే బగ్​ కారణంగానే ఇంటర్నెట్​ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. అప్​డేట్​ల కోసం చెక్​ చేయడానికి, సెట్టింగ్స్ ఓపెన్​ చేసి, General > Software Update కి వెళ్లి, అప్​డేట్ ఉంటే, డౌన్​లోడ్​ చేసి ఇన్​స్టాల్ బటన్​పై నొక్కాలి. 

   ఎయిర్ ప్లేన్ మోడ్​ని ఆన్​ చేసి, తర్వాత దాన్ని మళ్లీ ఆఫ్​ చేయాలి. అలా చేస్తే నెట్ వర్క్ కనెక్షన్​ని రీసెట్ చేసేందుకు స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంది.