తెలంగాణలోని 17 వేల స్కూళ్లలోనే  ఇంటర్నెట్..

  • సర్కారులో స్కూళ్లలో 21%.. ప్రైవేటులో 84% ఫెసిలిటీ 
  • యూడైస్ ప్లస్ 2023-24 డేటా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా దానికి అనుగుణంగా స్కూళ్లు డెవలప్ కావడం లేదు. రాష్ట్రంలోని మొత్తం స్కూళ్లలో కనీసం 60 శాతం బడులకు ఇంటర్నెట్ సౌకర్యం లేదని ఇటీవల విడుదలైన యూడైస్ ప్లస్ 2023–24 డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం..రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు మొత్తం 42,901 స్కూళ్లుండగా.. వాటిలో 33,434 (77.9%) స్కూళ్లలోనే కంప్యూటర్లున్నాయి.

వీటిలోనూ 73శాతం సర్కారు బడుల్లో, 90శాతానికిపైగా ప్రైవేటు స్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. అయితే, వాటికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేదని డేటా తెలిపింది.  కేవలం 17,114 (39.9%) స్కూళ్లలో మాత్రమే ఇంటర్నెట్ ఉన్నదని వివరించింది. మొత్తం 30,022 సర్కారు బడులు ఉండగా అందులో కేవలం 6,578(21%) స్కూళ్లకే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇక 662 ఎయిడెడ్ స్కూళ్లలో 245 బడులకు నెట్ ఫెసిలిటీ ఉంది. ఇక 12,126 ప్రైవేటు విద్యాసంస్థల్లో 10,279(84%) స్కూళ్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందని డేటా వెల్లడి పేర్కొంది. 

డేటాలోని కొన్ని ముఖ్యమైన అంశాలు...

  • రాష్ట్రంలోని 33,940 బడుల్లో మెడికల్ చెకప్​లు చేశారు.
  •  బాయ్స్ టాయ్ లెట్స్ 41,388 బడులకుగానూ..36,442 స్కూళ్లలో ఫెసిలిటీ ఉంది. కానీ, 33,792 స్కూళ్లలోనే ఫంక్షనింగ్ అవుతున్నాయి. 
  •   గర్ల్స్ టాయ్ లెట్స్ 42,209 స్కూళ్లకు గానూ.. 40,090 స్కూళ్లలో ఉన్నాయి. వీటిలోనూ 33,940 బడుల్లోనే అవి ఫంక్షనింగ్ లో ఉన్నాయి. 
  • మొత్తం 42,901 బడులకు 40,836 స్కూళ్లలో కరెంట్ కనెక్షన్లున్నాయి. అయితే, 39,535 బడులకే కరెంట్ సప్లై అవుతున్నది. 
  • స్టేట్ లో 41,800 బడుల్లో వాటర్ సౌకర్యం ఉన్నా.. 39,762 స్కూళ్లలో ఫంక్షనింగ్ జరుగుతున్నది. 
  • రాష్ట్రవ్యాప్తంగా 72.93 లక్షల మంది స్టూడెంట్లకు గానూ.. 65.58 లక్షల మందికి ఆధార్ ఉన్నది. 
  • స్టేట్​ లో ఎస్సీలు 16%, బీసీలు 49.7%, ఎస్టీలు 10శాతం, మైనార్టీలు 15శాతం, జనరల్ స్టూడెంట్లు 24.3శాతం మంది చదువుతున్నారు.