చందమామ దినోత్సవం.. చంద్రయాన్ కూడా ఇప్పుడే.. అన్నీ కలిసొచ్చాయా.. చరిత్ర ఏంటీ

చందమామ దినోత్సవం.. చంద్రయాన్ కూడా ఇప్పుడే.. అన్నీ కలిసొచ్చాయా.. చరిత్ర ఏంటీ

జూలై 20, 2023న అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా స్మరించుకోవడానికి ప్రపంచం సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనలో సాధించిన అద్భుతమైన విజయాలను సెలబ్రేట్ చేసుకునేందుకు దీన్ని ఒక ప్రత్యేక రోజుగా భావిస్తారు. 1969లో తొలిసారిగా చంద్రునిపై కాలుమోపిన ఇద్దరు వీరోచిత వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లను స్మరించుకునే, గౌరవించే రోజు కూడా ఇదేనని చెప్పవచ్చు.

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం అనేది గత యాభై ఏళ్లలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందింది, మనం ఇంకా ఎంత ముందుకు వెళ్లాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. చంద్రునిపైకి మొదటి మానవ ప్రయాణాన్ని గుర్తించిన ముఖ్యమైన సంఘటనను ప్రజలు ప్రేమగా తిరిగి చూసుకోవాల్సిన సమయం కూడా ఇదే.

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం చరిత్ర

జూలై 20, 1969న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవులుగా చరిత్ర సృష్టించారు. నాలుగు రోజుల తీవ్రమైన ప్రయాణం తర్వాత, వారు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. “ఇది మనిషికి ఒక చిన్న అడుగు, మానవజాతికి ఒక పెద్ద ఎత్తు” అంటూ ఆర్మ్ స్ట్రాంగ్ జంట అప్పట్లో చంద్రుని ఉపరితలంపైకి వెళ్లారు.

ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అయినప్పటికీ, బజ్ ఆల్డ్రిన్ అతని కంటే తక్కువేం కాదు. ఆల్డ్రిన్ అపోలో 11 లూనార్ మాడ్యూల్ పైలట్‌గా పనిచేసిన అసాధారణ పైలట్, నావిగేటర్. అతను మిషన్‌లో అంతర్భాగంగా కూడా ఉన్నాడు. అతను లేకుండా, ఇది విజయవంతం కాలేదు. చంద్రునిపై ఉన్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ తో పాటు ఆల్డ్రిన్ కూడా శాంపిల్స్ ను సేకరించారు. చరిత్రలో అత్యంత ప్రసిద్ధ చెందిన చిత్రాలలో కొన్నిగా మిగిలిపోయిన ఛాయాచిత్రాలను ఆయన తీశారు.

డిసెంబర్ 9, 2021న, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) A/RES/76/76 తీర్మానం ద్వారా జూలై 20ని అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా ప్రకటించింది.

అంతర్జాతీయ చంద్రుని దినోత్సవం ప్రాముఖ్యత

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా, ఈ ఇద్దరు ధైర్య వీరులను గౌరవిస్తూ, అంతరిక్షంలోకి వారి అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటాం. వారు భవిష్యత్ వ్యోమగాములకు మార్గం సుగమం చేశారు. అంతే కాకుండా కొత్త ప్రపంచాన్ని అన్వేషించాలనే కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడ్డారు. అందుకే వారి సహకారానికి ప్రతీకగా ప్రపంచం ఈ రోజును అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా జరుపుకుంటోంది.

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం దాని చారిత్రక ప్రాముఖ్యత కారణంగా మాత్రమే ముఖ్యమైనది కాదు. అంతరిక్ష పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయని ఇది గుర్తుచేస్తోంది. గత 50 సంవత్సరాలుగా సాంకేతికతలో ఎన్నో అద్భుతమైన పురోగతిని సాధించాం. ఇది మునుపెన్నడూ లేనంతగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు వీలు కల్పించింది. ఇప్పుడు మన సౌర వ్యవస్థకు ఆవల ఉన్న గ్రహాలను కూడా అన్వేషించగలుగుతున్నాము. దీనికి కారణం ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ కన్న కలలే అని కూడా చెప్పవచ్చు.