"ముద్దు" ఆరోగ్యమా.. అనారోగ్యమా?. ముద్దుల ప్రయోజనాలు..వాస్తవాలు

"ముద్దు" ఆరోగ్యమా.. అనారోగ్యమా?. ముద్దుల ప్రయోజనాలు..వాస్తవాలు

నాలుగు పెదాలు కలిస్తే ముద్దు. ముద్దు మానసిక ఆనందం..ప్రశాంతతను ఇస్తుంది. ఒకరిపై ప్రేమను, వారిపై అభిమానాన్ని తెలిపే అందమైన సాధనం. ముద్దు రెండు బంధాలను మరింత దగ్గర చేస్తుంది. ముద్దు..దాని చరిత్ర అనగానే మనకు అలెగ్జాండర్ గుర్తొస్తారు. అలెగ్జాండర్ తన దండయాత్రలో భాగంగా అన్ని రాజ్యాలు తిరిగినప్పుడు పాశ్చాత్య ముద్దులను విశ్వవ్యాప్తం చేశారట. ముద్దు ప్రస్తావన మహాభారతంలో కూడా ఉందట. 

ముద్దు ఎలా పుట్టిందంటే..

ముద్దు చరిత్ర ఇప్పటిది కాదు..మిలియన్ ఏళ్ల క్రితమే ముద్దు మొదలైంది. నోటితో నోటికి ఆహారాన్ని తినిపించే క్రమంలో ముద్దు మొదలైంది. పూర్వ కాలంలో తల్లులు తమ బిడ్డలకు ఆహారాన్ని నమిలి మెత్తగా అయ్యేలా చేసి నోటినే అందించే వారట. ఆ సమయంలో పెదవులకు పెదవులు తగిలి వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం పొంగేదట. అలా తల్లి  బిడ్డను  ముద్దాడడంతో ముద్దు అనేది మొదలైందని చరిత్రకారులు భావిస్తున్నారు.

ముద్దు చరిత్ర..

భారతదేశంలో వేద సంస్కృత సాహిత్యంలోని ప్రధాన గ్రంథాల్లోనూ ముద్దుల ప్రస్తావన ఉంది. క్రీస్తు పూర్వ 1500 శతాబ్దంలో ప్రజలు ముక్కును ముక్కుతో రుద్దడం ద్వారా తమ ప్రేమను పంచుకునేవారట. అలా పెదవులపైకి ముద్దు జారి ఉండొచ్చని చరిత్రకారుల చెబుతున్నారు. ముద్దుపై  మహాభారతంలోని పద్యం రాయబడింది. క్రీ.శ. 6వ శతాబ్దంలో  వాత్స్యాయన అనే భారతీయ తత్వవేత్త "వాత్స్యాయన కామసూత్రం"లో  అనేక రకాల ముద్దులను వివరించాడట, దీనిని "కామసూత్ర" అని పిలుస్తారు. అయితే ఈ ముద్దు సంస్కృతి మొదలైంది అని అనగానే మాత్రం అందరూ రోమ్ వైపే చూస్తారు. వేల ఏళ్ల క్రితం రోమ్ లో  ముద్దుల ప్రభంజనం మొదలైందట. 

ముద్దుకు చిహ్నం ఏంటంటే..

ముద్దుకు సాంప్రదాయ చిహ్నం ఎరుపు పెదవుల కలయిక. ముద్దు చిహ్నంగా ఇది ఉపయోగిస్తారు. ప్రస్తుతం కాలంలో కౌగిలింత కోసం  "X" చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది "O" తో కలిపి ఉంటే ముద్దులను సూచిస్తుంది. కాబట్టి మీకు ఎవరైనా  “XOXO” అని సందేశం పంపితే..వారు ముద్దులు, కౌగిలింతలు కోరుకుంటున్నారని అర్థం. 

ముద్దు ఆరోగ్యమా లేక అనారోగ్యమా? ముద్దుతో ఎన్ని కేలరీలు కరిగిపోతాయి?

ముద్దు పెట్టుకోవడం వల్ల శారీరక శ్రమతో కూడిన  క్యాలరీలు ఖర్చవుతాయి అన్నది నిజం. గాఢమైన ముద్దులు పెట్టుకునే సమయంలో ..ఎక్కువ సమయం పాటు ముద్దులు పెట్టుకున్నప్పుడు కాలరీలు ఖర్చయిపోతాయి. చాలా ఉద్వేగభరితమైన ముద్దు నిమిషానికి 2-3 కేలరీలు బర్న్ చేస్తుందట. 

ముద్దుతో దంతాలకు ప్రయోజనాలు..

ముద్దు శరీరానికి, మనస్సుకు మాత్రమే కాదు.. దంతాలకు అద్భుతమైన ఔషధం. ముద్దు ప్రక్రియ దంతాల్లోని లాలాజల గ్రంధులను ప్రేరేపిస్తుంది.మంచి లాలాజలం మంచి ఉత్పత్తికి దారితీస్తుంది. నోటిని హైడ్రేట్ గా ఉంచడానికి, దంత క్షయం, నష్టాలను నివారించడానికి ముద్దు ఉపయోగపడుతుందట.

ముద్దు గురించి మరిన్ని వాస్తవాలు..

  • ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ భర్త పనికి వెళ్లే ముందు  స్త్రీలను తమ భర్తలను  ముద్దుపెట్టుకుంటారు. అలాంటి  పురుషులు మిగిలిన వారి కంటే ఐదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట. 
  • ముద్దు వల్ల క్రిములు వ్యాప్తి చెందుతాయి, ఇది మంచి లేదా చెడు రెండూ కావచ్చు. ఒక పెక్ శరీరానికి 80 మిలియన్ కొత్త బ్యాక్టీరియాను పరిచయం చేస్తుంది, ఇది ప్రేగు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • సగటు ప్రజలు తమ జీవితంలో కనీసం రెండు వారాలు ముద్దులో గడుపుతారు. 
  • ఇండియానా రాష్ట్రంలోని ఒక వింత చట్టం ఉంది.  ఇది మీసాలు ఉన్న పురుషులు..ఇతర మనుషులను ముద్దు పెట్టుకోకూడదట.

 అబ్బాయిలు ఏ ముద్దులను బాగా ఇష్టపడతారు?

 అబ్బాయిలు ఇష్టపడే శృంగార ముద్దుల జాబితా

  • బ్లోన్ కిస్.
  • టేస్టీ ముద్దు.
  • ఫ్రెంచ్ కిస్.
  • ఎస్కిమోస్ ముద్దు.
  • సీతాకోక చిలుక ముద్దు.
  • లిప్ కిస్. 
  • మెడపై ముద్దు.
  • చెవిపోగులు ముద్దు
  • తడి ముద్దు.

 అమ్మాయి కోరుకునే ముద్దులు

అమ్మాయిలు ఎక్కడ ఎక్కువగా ముద్దు పెట్టుకుంటారు? అమ్మాయిలు ఇష్టపడే అనేక రకాల ఉత్తేజకరమైన ముద్దులు ఇవే. 

  • నుదిటి ముద్దు
  • ఫింగర్ కిస్
  • బ్యాక్ కిస్
  • నెక్ కిస్
  • బల్లి ముద్దు
  • ఇయర్‌లోబ్ ముద్దు
  • సింగిల్-లిప్ ముద్దు
  • ఫ్రెంచ్ కిస్