
ముద్దు..పిల్లలకు పెడితే ముచ్చట..పెద్దలకు పెడితే ప్రేమ.. ఇష్టలేని వారికి పెడితే యాక్ ఛీ.. అపరిచితులకు పెడితే నేరం..పెళ్లయిన జంట ముద్దు పెట్టుకుంటే అనురాగం.. అదే విధంగా ఎక్కడెక్కడ ముద్దు పెట్టాం అనే దాన్ని బట్టి ఉంటుంది ఆ వ్యక్తి ప్రేమ.. నుదుటపై పెడితే ప్రేమ.. బుగ్గపై పెడితే ఇష్టం.. పెదాలపై పెడితే కామం.. ఇలా ముద్దు ముద్దుకు ఓ వర్ణన ఉంది.. ముద్దుకో కథ ఉంది.. ముద్దుకో ముచ్చట ఉంది.. ఇదంతా ఎందుకు అంటారా.. ఇవాళ ప్రపంచ ముద్దుల దినోత్సవం.. అదేనండీ వరల్డ్ కిస్సింగ్ డే.. ప్రతి ఏటా జులై 6వ తేదీన ప్రేమికులు ఘనంగా జరుపుకునే ముద్దుల పండుగ.. 23 సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ వేడుకను..
ఇంతకీ ముద్దుల్లోని రకాలు ఎన్నో తెలుసుకుందామా :
ఎస్కిమో ముద్దు :
ఈ ముద్దు ఎక్కువగా చిన్న పిల్లలకు ఇస్తుంటారు. మన ముక్కుతో చిన్న పిల్లల ముక్కును తాకిస్తూ.. ముచ్చటగా ముద్దు ఇచ్చినట్లు ఫీలవుతుంటారు కదా.. దాన్ని ఎస్కిమో కిస్ అంటారు. భగ్న ప్రేమికుల్లో ఇలాంటి ఎస్కిమో ముద్దులు ఉంటాయి. బాగా ఇష్టమైన వారితో ఎస్కిమోతో తమ ప్రేమను పంచుకుంటూ ఉంటారు.
ఫ్రెంచ్ కిస్ :
ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. లిప్ టూ లిప్ కిస్. గతంలో అంటే అమ్మో బూతు అన్నట్లు చూసేవారు. ఇప్పుడు సినిమాల్లోనూ సాధారణం అయిపోయాయి ఫ్రెంచ్ కిస్ లు. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కిస్ అంటే ఫ్రెంచ్ కిస్ అన్నట్లు తయారైపోయింది. ప్రేమికులు, భార్యభర్తల మధ్య తరచుగా జరిగే ప్రేమకు గుర్తు.. ఈ ఫ్రెంచ్ కిస్. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫీలింగ్ ఈ కిస్ తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు సైతం.
నుదుటి ముద్దు :
ప్రేమానురాగాలతో ముడిపడిన ముద్దే.. నుదుటి ముద్దు. సున్నితంగా.. మృధువుగా.. ఆప్యాయతగా ఉంటుంది. ఓ వ్యక్తిపై ఉన్న ప్రేమ, అనురాగాలు, ప్రశంసలు చూపించే సమయంలో ఈ నుదుటి ముద్దు ఇస్తుంటారు. తల్లి తన బిడ్డకు.. నాన్న తన బిడ్డకు.. ప్రేమికుడు తన ప్రియురాలిపై శ్రద్ధను చూపించే సమయంలో నుదుటి ముద్దును వాడతారు.
సీతాకోక చిలుక ముద్దు (బటర్ ఫ్లై కిస్) :
ముద్దులలో సీతాకోకచిలుక ముద్దు అందమైన ముద్దు. ఇద్దరు ప్రేమికులు తమ భాగస్వామి శరీరభాగాలపై ఇచ్చే ముద్దు. ఒకరి బుగ్గలను ఒకరు చుంబిస్తూ..ఒకరి చర్మంపై మరొకరు తేలికగా నిమురుతూ ఇచ్చే ముద్దు. ఈ ముద్దు ఇద్దరి వ్యక్తుల మధ్య సన్నిహిత్యాన్ని, శృంగార అభిమానాన్ని సూచిస్తుంది.సీతాకోకచిలుక ముద్దు ఇచ్చే సమయంలో మీ భాగస్వామి ముఖానికి మీ ముఖాన్ని దగ్గరగా తీసుకొచ్చి ..మీ కళ్లతో వారి కళ్లను తాకాలి. తర్వాత కనురెప్పలను కొట్టాలి. ఇది వారికి సీతాకోకచిలుక రెక్కల ద్వారా ముద్దు పెడుతున్నట్టు అనిపిస్తుంది.
లిప్ కిస్..
దీన్నే లిప్ లాక్ అనికూడా అంటారు. ఈ ముద్దు పెడితే ఇరువురి శరీరంలోని ఇతర భాగాలు జివ్వుమంటాయి. లిప్ లాక్ లో తమ భాగస్వామి పెదాలను గట్టిగా కొరికేస్తారు. చప్పరిస్తారు. ఇది ఎలా చేయాలంటే..మీ భాగస్వామి పెదవులపై మీ పెదాలను ఉంచి, సున్నితమైన ముద్దును ఇవ్వాలి. కొద్దిసేపు పెదాలను వారి పెదాలపై ఉంచిన తర్వాత సున్నితంగా పెదాలను పీల్చడమే లిప్ లాక్.
పెక్ ముద్దు
పెక్ ముందు భాగస్వామి పట్ల ఆప్యాయతను చూపిస్తుంది. ఈ ముద్దులో భాగస్వాములిద్దరు పెదాలు కలిసి మూసుకుపోతాయి. నాలుగు పెదాలు గట్టిగా కలిసి మళ్లీ విడిపోతాయి. దీనికి ప్రత్యేకంగా టెక్నిక్, ప్రాక్టీస్ అవసరం లేదు.
చేతి ముద్దు
హ్యాండ్ కిస్ ఇది గౌరవంతో ఇవ్వచ్చు. ప్రేమతో ఇవ్వొచ్చు. అప్యాయతతో ఇవ్వొచ్చు. చిన్నారి పెద్ద వాళ్లకు ఇవ్వొచ్చు. పెద్దవాళ్లు చిన్నపిల్లలకు ఇవ్వొచ్చు. ఈ కిస్ లో భాగంగా చేతిని పట్టుకుని ముద్దు పెడితే చాలు. ఈ సమయంలో సున్నితమైన, వెచ్చని అనుభూతి కలుగుతుంది.