ఫారిన్​ చదువుల కోసం.. సిటీలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ఫారిన్​ చదువుల కోసం..  సిటీలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

ఈ గురువారం హోటల్ మ్యారిగోల్డ్‌‌లో..

హైదరాబాద్, వెలుగు : విదేశాల్లో చదువు కోవాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌‌‌‌ ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్’ను ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్(ఐఎంఎఫ్‌‌ఎస్)  ఈ నెల 17న(గురువారం) నిర్వహిస్తోంది. బేగంపేటలోని ‘ది హోటల్ మ్యారిగోల్డ్‌‌’లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈ ఫెయిర్ జరుగనుంది. దీనిలో ఎనిమిది దేశాల నుంచి 70కి పైగా యూనివర్సిటీలు పాల్గొననున్నాయని ఐఎంఎఫ్‌‌ఎస్ హైదరాబాద్ డైరెక్టర్ అజయ కుమార్ తెలిపారు. బ్రిటీష్ కౌన్సిల్‌‌ లాంటి సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్టేక్‌‌హోల్డర్స్ ఈ ఫెయిర్‌‌‌‌లో పాల్గొంటారు.  ఐలెట్స్ లాంటి ప్రిపరేషన్ టెస్ట్‌‌లను కూడా విద్యార్థులకు కండక్ట్ చేస్తారు. బ్యాంక్‌‌లు, ఎన్‌‌బీఎఫ్‌‌సీ విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అందజేసే లోన్స్‌‌పై అవగాహన కల్పిస్తాయి.

అమెరికా కన్సల్టేట్ నుంచి ఎడ్యుకేషన్ యూఎస్‌‌ఏ ప్రతినిధులు కూడా దీనిలో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలో విద్య, అమెరికన్ వీసా ప్రాసెస్ గురించి కీలకమైన సమాచారాన్ని ఇన్‌‌ఫర్మేషన్ సెషన్ల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. వీఎన్‌‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ డీఎన్ రావు ఈ గ్లోబల్ ఎడుఫెస్ట్‌‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతమ్, గాయత్రి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ పీవీఆర్‌‌‌‌కే మూర్తి పాల్గొననున్నారని అజయ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ గ్లోబల్ ఎడ్యుఫెస్ట్‌‌కు హాజరై, విదేశాల్లో విద్యావకాశాల గురించి తెలుసుకోవాలని అజయ కుమార్ సూచించారు.