డ్రగ్స్ కేసులో నిందితుడు టోని పోలీస్ కస్టడీ ముగిసింది. ఐదు రోజుల పాటు టోనిని సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. టోనితో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. టోనికి వ్యాపార వేత్తలకు ఏజెంట్లు గా పనిచేసిన10 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. టోని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. టోనితో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసుల గాలిస్తున్నారు. టోని ఇచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్ కంట్రోల్ సెల్ , టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. టోని కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్సైట్, ఇంటర్నెట్ కాల్స్ పరీశీలిస్తున్నారు. 10కి పైగా బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించారు. టోనిని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం కనిపిస్తోంది. అరెస్ట్ అయిన 8 మంది టోని ఏజెంట్లను కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు.
మరోవైపు చంచల్ గూడ జైల్ నుండి వ్యాపార వేత్తలు విడుదల అయ్యారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 9 మంది వ్యాపార వేత్తలు బెయిల్ పై విడుదల చేశారు పోలీసులు. వ్యాపారవేత్తలకు నిన్న బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీంతో ఇవాళ చంచల్ గూడ జైల్ నుండి ఏడుగురు వ్యపారులు ఇద్దరు ఆఫీస్ బాయ్స్ విడుదల అయ్యారు.
