ఏప్రిల్​ 17న ‘ఇంటర్నేషనల్​ బ్యాట్​ అప్రిసియేషన్​ డే

ఏప్రిల్​ 17న ‘ఇంటర్నేషనల్​ బ్యాట్​ అప్రిసియేషన్​ డే

ఏప్రిల్​ 17వ తారీఖున ‘ఇంటర్నేషనల్​ బ్యాట్​ అప్రిసియేషన్​ డే’ జరిగింది. బ్యాట్​ అంటే తెలుసుకదా గబ్బిలం. ఎగిరే క్షీరదాలు అయిన వీటి చుట్టూ ఉన్న అపోహలను తొలగించి, ఎకో సిస్టమ్​(జీవావరణ వ్యవస్థ)కి ఈ జీవి వల్ల కలుగుతున్న లాభాల గురించి చెప్పడం ఈ డే ప్రధాన ఉద్దేశం. యుఎస్​లో ‘బ్యాట్​ కన్జర్వేషన్​ ఇంటర్నేషనల్’​ అనే ఎన్జీవో... ప్రపంచవ్యాప్తంగా గబ్బిలాల్లో ఉన్న పలు జాతులను పరిరక్షించే పనిలో ఉంది. ఈ డేను 2013 నుంచి ప్రతి ఏడు ఏప్రిల్​ 17న జరుపుతున్నారు. ఎకో సిస్టమ్​లో ప్రతీ జీవి తనదైన రోల్​ ప్లే చేస్తూ పర్యావరణాన్ని కాపాడటంలో సాయం చేస్తుంటుంది. ఒక్క మనుషులు తప్ప భూమ్యాకాశాలకు చెడు చేసే జీవి విశ్వంలోనే లేదన్నమాట!