రెచ్చిపోయిన ఇంటర్ విద్యార్థులు.. క్లాస్ రూంలోనే విద్యార్థిపై దాడి.. తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఓ పైవేట్ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థులు రెచ్చిపోయారు. క్లాస్ రూంలోనే తోటి విద్యార్థిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. విద్యార్థిని రైండప్ చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. 

రాజేంద్రనగర్ లోని శ్రీ మేధ జూనియర్ కాలేజీలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు..తోటి విద్యార్థిపై శుక్రవారం ఆగస్టు 2, 2024 న మధ్యాహ్నం దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు లంచ్ బ్రేక్ సమయంలో మరో విద్యార్థిని రౌండప్ చేసి చితకబాదారు. పిడిగుద్దులతో విద్యార్థిపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.. 

విద్యార్థిపై దాడి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాలకు చేరుకున్నారు. కళశాల ఎదుట ఆందోళనకు దిగారు. కొడుకుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..   విద్యార్థులు..వీధి రౌడీల్లో దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.