మార్చి 5 నుంచి ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఒకేషనల్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు సోమవారం రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి  22 వరకు పరీక్షలు కొనసాగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఫస్టియర్‌‌లో పార్ట్ ‘ఏ’కు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సు మార్చి 5న, ఇంగ్లీష్ పేపర్–1 మార్చి 7న ఉంటుందని చెప్పారు. మార్చి11, 13, 17 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పార్ట్ –బీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 

బ్రిడ్జి కోర్సుకు సంబంధించి మ్యాథమేటిక్స్, బయాలాజికల్ సైన్స్ పేపర్–1 పరీక్షలను మార్చి19న, ఫిజికల్ సైన్స్ పేపర్–1మార్చి 21న జరగనున్నాయి. ఒకేషనల్ సెకండియర్ పరీక్షల్లో భాగంగా పార్ట్– ఏకు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్స్ మార్చి 6న, ఇంగ్లీష్ పేపర్–2 మార్చి 10న జరగనున్నది. సెకండియర్ పార్ట్–బీ పరీక్షలు మార్చి 12, 15, 18 తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నారు. బ్రిడ్జికోర్సు మ్యాథమేటిక్స్, బయాలాజికల్ సైన్స్ పేపర్– 2 పరీక్షను మార్చి20న, ఫిజికల్ సైన్స్ పేపర్– 2 పరీక్ష మార్చి 22న  జరగనున్నది. మరోపక్క ప్రాక్టీకల్ పరీక్షలు జనరల్ సబ్జెక్టుల వారితో పాటుగానే ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.