ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా 

వెలుగు ఫొటోగ్రాఫర్ కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటలయ్యేదాకా చలి వదలడం లేదు. చలికితోడు పొగమంచుతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచులో వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో మంచు దుప్పటి వేసినట్లుగా కనిపించింది.