ప్రేమ గుడ్డిది అన్న నానుడి తరచూ వింటూనే ఉంటాం. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అయితే.. గుడ్డిగా ప్రేమలో పడ్డ జంటల్లో సక్సెస్ ఫుల్ గా సంసారం చేసుకుంటున్న వాళ్ళను వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు. ప్రేమ మైకంలో పడిపోయి, వావి వరస లేకుండా గుడ్డిగా నమ్మి నేటి యువత గోతిలో పడుతున్నారు. కళ్లకు కనిపించిందే ప్రపంచం అని నమ్మి హద్దులు మీరు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్నోళ్ల సంసారాలు నెల కూడా విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ కోవకు చెందిందే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇంస్టాగ్రామ్ లవ్ స్టోరీ.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలోని ములకల చెరువు మండలం, వడ్డిపల్లికి చెందిన 23 ఏళ్ళ ఇంద్రశేఖర్, ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన సిటిఎం కు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతికి అప్పటికే వివాహమై ఉండటం ఆమె సంసారంలో చిచ్చు పెట్టింది.
Also Read :- ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ
ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని మహిళ భర్త పసిగట్టాడు. తన భార్యను తనకూ.. తన బిడ్డలకు కాకుండా విడదీసిన ఇంద్రశేఖర్ ను పట్టుకుని బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు ఆమె భర్త. తన అనుచరులతో ఇంద్రశేఖర్ ను వెంబడించి, మదనపల్లె జిల్లా ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి ఇంద్రశేఖర్ ను పట్టుకున్నాడు. అనుచరులతో కలసి తన భార్య ముందే ఆమె ఇంస్టాగ్రామ్ ప్రియున్ని చితగ్గొట్టి దేహశుద్ధి చేశాడు. గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.