కొత్త బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి మాట్లాడిన కోహ్లీ
  • హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరపడుతున్న వేళ.. విరాట్ కోహ్లీ కొత్త బాధ్యత తీసుకున్నాడు. రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియాలో స్ఫూర్తిని నింపే పనిలో పడ్డాడు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత వెనక సీటుకే పరిమితమైన కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ గురువారం మాత్రం సహచరులతో అన్ని విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాడు. తన స్ఫూర్తిదాయకమైన మాటలతో ప్లేయర్లలో కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచే ప్రయత్నం చేశాడు. 

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రాతో సహా మిగతా ప్లేయర్లందరూ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాటలను శ్రద్ధగా విన్నారు. రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది. రాహులతో కలిసి నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త, పాత బడిన బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. యశస్వి కూడా కొత్త బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొన్నాడు. పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గడ్డి ఎక్కువగా ఉండటంతో సీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయిని అంచనా వేస్తున్నారు. 

హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌటే..

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మార్పులు చేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా స్థిరంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అయితే గబ్బా పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శైలికి బాగా సరిపోతుంది. కాకపోతే పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు వికెట్లు తీసిన అతను పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఘోరంగా తేలిపోయాడు. అయితే ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండటం కూడా కలిసొచ్చే అంశం. 

కాకపోతే గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హర్షిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రోజు వర్షం పడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో బలమైన సీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకోవాలని గౌతీ ఆలోచిస్తున్నాడు. సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముస్తాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో రాణించిన పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీ ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావడం కష్టమే. టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడే ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతను ఇంకా సాధించలేదని తెలుస్తోంది.  

ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు?

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా కనిపిస్తున్నా.. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా చూస్తే అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాడు. ఇక ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర జడేజాను మించినోళ్లు లేరు. దీంతో మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడే ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు? అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలువరించే టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అశ్విన్ బాగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. జడేజాకు ఇంకా చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదు.