శిశువు మృతిపై ఎంక్వైరీ

గద్వాల, వెలుగు: గవర్నమెంట్  హాస్పిటల్ లో శిశువు మృతి చెందిన ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ ఏడీ పద్మజ బుధవారం ఎంక్వైరీ చేశారు. బుధవారం ఉదయం గట్టు మండలం బోయలగూడెం గ్రామానికి చేరుకొని బాలింత సుజాతతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కోసం ఎప్పుడు వెళ్లారు? గట్టు హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడి నుంచి గద్వాల హాస్పిటల్ కి వెళ్లాక డాక్టర్లు ఎలా హ్యాండిల్  చేశారనే విషయంపై ఆరా తీశారు. 

ఈ నెల 6న బాలింత డెలివరీకి వెళ్లగా శిశువు మృతి చెందింది. ఈ ఘటనపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాస్పిటల్  సిబ్బంది, డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి రిపోర్ట్​ను ఉన్నతాధికారులకు ఇస్తామని ఏడీ తెలిపారు.