ఓటర్​ లిస్టులో పేర్లు తొలగింపుపై విచారణ

కోడేరు, వెలుగు: తమ పేర్లను ఓటర్​ లిస్టులో నుంచి తొలగించారని మండలంలోని ముత్తిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 115 మంది ఫిర్యాదు చేయడంతో, అడిషనల్​ కలెక్టర్  కుమార్ దీపక్  విచారణ చేపట్టారు. తహసీల్దార్  ఆఫీస్​లో విచారణ చేపట్టి, 60 మంది పేర్లు లిస్ట్​లో లేనట్లు గుర్తించారు. అర్హులైన వారిని విచారించి పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు. అర్హులైన వారి పేర్లు తిరిగి నమోదు చేస్తున్నామని, కొన్ని పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. వాటిపై విచారణ చేసి సమస్య పరిష్కరిస్తానని తెలిపా. అంజన్ గౌడ్, శరత్ చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్వామి, భాస్కర్  ఉన్నారు.