ఏఎస్ఐ సూసైడ్ అటెంప్ట్​పై ఎంక్వైరీ

  • ఆరోపణలు రుజువైతే చర్యలు 

చిలప్ చెడ్, వెలుగు : మెదక్  జిల్లా చిలప్​చెడ్​ పోలీస్​స్టేషన్​లో ఏఎస్ఐ సుధారాణి సూసైడ్​ అటెంప్ట్​ చేసుకున్న ఘటనపై గురువారం నర్సాపూర్​ సీఐ జాన్​రెడ్డితో కలిసి తూప్రాన్​ డీఎస్పీ వెంకట్​రెడ్డి విచారణ జరిపారు. ఎస్ఐ యాదగిరి డ్యూటీ విషయంలో మానసికంగా వేధించడం వల్లే తాను సూసైడ్​ అటెంప్ట్​ చేసినట్లు బాధితురాలు సుధారాణి సూసైడ్​ లెటర్​లో రాసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఎస్ఐతో పాటు స్టేషన్​లో పని చేసే ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు. కాగా, సుధారాణి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఎస్పీకి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఆరోపణలు రుజువైతే ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు.