ముగిసిన లోకేష్ సీఐడీ విచారణ.. అక్టోబర్ 11 మళ్లీ రావాలని నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్  ఏపీ సీఐడీ అధికారుల విచారించారు.  రేపు ( అక్టోబర్ 11)మరోసారి విచారణకు రావాలని లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.  సుమారు 8 గంటల పాటు లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారించారు.  లోకేష్ కు సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం అందుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఎ 14 గా ఉన్న లోకేష్  ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో హెరిటేజ్ సంస్థలకు లబ్ధిచేకూరేలావ్యవహరిచాడని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు.   హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై నారా లోకేష్ ఒత్తిడి తెచ్చారనే విషయాలపై లోకేష్ కు ప్రశ్నించారని సమాచారం. అయితే లోకేష్ విచారణకు సహకరించలేదని సీఐడీవర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మరి రేపటి ( అక్టోబర్ 11) విచారణ తరువాత సీఐడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.. .