మన ఐటీ ఆఫీసులో పులి ఉంది.. ఇంట్లో నుంచే పని చేయండి : ఇన్ఫోసిస్ ప్రకటన

ప్రముఖ సాఫ్ట్​ వేర్​ సంస్థ ఇన్ఫోసిస్..తన బెంగళూరు బ్రాంచ్​ఉద్యోగులకు వార్నింగ్​ మెయిల్స్​ పంపించింది. మీరు ఆఫీసుకు రావొద్దు.. ఇంటికానుంచే పనిచేయం డి..మేం చెప్పేదాక ఆఫీసుకు రావొద్దు..ఎవ్వరూ(ఏ ఎంప్లాయీ కూడా) రూల్స్​ అతిక్రమించొద్దు..అతిక్రమిస్తే ప్రమాదం పడతారు అని హెచ్చరించింది.. స్వయంగా హెఆర్​ డిపార్టుమెంట్​ అందరు ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది.. ఇంతకీ ఇన్ఫోసిస్​ ఎందుకు ఉద్యోగులకు అలా లెటర్లు పంపించింది.. బెంగళూరు ఇన్ఫోసిస్​ లో ఏంజరుగుతోంది..? 

ఇన్ఫోసిస్​ మైసూరు క్యాంపస్​ లో  అనుకోని అతిథులు  సంచరిస్తున్నారు. దీంతో డిసెంబర్​31న ఉద్యోగులందరూ  ఇంటినుంచే పనిచేయాలని కంపెనీ  హెచ్​ఆర్​ డిపార్టుమెంట్​ మెయిల్స్​ పంపింది. అంతేకాదు క్యాంపస్​ భద్రతకోసం అటు అటవీశాఖ, ఇటు టాస్క్​ ఫోర్స్ సిబ్బంది మోహరించింది. ఎందుకు ఏమిటీ అని పూర్తి మెయిల్​ చదివితే.. అసలు విషయం తెలిసింది. 

ALSO READ | దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం..ఎక్కడంటే.?

హెబ్బాల్​ ఇండస్ట్రియల్​ ఏరియాలో ఉన్న మైసూరు ఇన్ఫోసిస్​ క్యాంపస్​ రిజర్వ్​ ఫారెస్ట్​ కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం చిరుతపులులకు నిలయం.. అప్పుడప్పుడు క్యాంపస్​ ఆవరణలో కూడా దర్శనమిస్తుంటాయి. ఈక్రమంలో రెండూ మూడు రోజులుగా క్యాంపస్​ ఆవరణలో తిరుగుతుండటంతో ఉద్యోగులకు భయం పట్టుకుంది.  

మైసూర్ ఇన్ఫోసిస్​ లో చిరుతపులి సంచారం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఓసారి క్యాంపస్ ఆవరణలోకి వచ్చి హల్​ చల్​ చేసింది.  2011లో ఓ సారి క్యాంపస్ లోకి రావడంతో ఉద్యోగులు సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఇప్పుడు మరోసారి క్యాంపస్​ ఆవరణలో కనిపించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.. 

ఎంప్లాయీస్​ సేఫ్టీ కోసం.. ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం ప్రకటించడమే కాకుండా.. క్యాంపస్​ ఆవరణలోకి చిరుత రాకుండా అటు అటవీశాఖ, ఇటు టాస్క్​ ఫోర్స్​ సిబ్బందితో ముందస్తుగా భద్రత చర్యలు చేపట్టింది మైసూర్​ఇన్ఫోసిస్​ కంపెనీ.