IND-W vs WI-W: వెస్టిండీస్‌తో భారత మహిళల సమరం.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఆస్ట్రేలియా పర్యటనలో వైట్‌వాష్ ఎదుర్కొని స్వదేశానికి చేరుకున్న భారత మహిళలు మరో సమరానికి సిద్ధమయ్యారు. స్వదేశంలో విండీస్ మహిళా జట్టుతో అమీ తుమీ తేల్చుకోనున్నారు. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం (డిసెంబర్ 15) నుండి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. 

ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు.. భారత మహిళా జట్టులో భారీ మార్పులు చేశారు. దారుణంగా విఫలమవుతున్న షఫాలీ వర్మను తప్పించారు. ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు నందిని కశ్యప్, రాఘవి బిస్త్, ప్రతీకా రావల్‌కు జట్టులో కల్పించారు.

మరోవైపు, హేలీ మాథ్యూస్ నేతృత్వంలోని వెస్టిండీస్‌ సైతం బలమైన జట్టే. గాయం కారణంగా అనుభవజ్ఞురాలైన స్టాఫానీ టేలర్ దూరమవ్వడం లోటే అయినప్పటికీ, గేల్ తరహాలో విధ్వంసకర ఆటకు పేరుగాంచిన డియాండ్రా డాటిన్‌ జట్టులోకి తిరిగి రావడం వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

టీ20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20 (డిసెంబర్ 15): డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ (నావీ ముంబై)
  • రెండో టీ20 (డిసెంబర్ 17): డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ (నావీ ముంబై)
  • మూడో టీ20 (డిసెంబర్ 19): డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ (నావీ ముంబై)

టీ20 సిరీస్ ముగిశాక.. ఈ ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

వన్డే సిరీస్ షెడ్యూల్

  • తొలి వన్డే (డిసెంబర్ 22): రిలయన్స్ స్టేడియం (వడోదర)
  • రెండో వన్డే (డిసెంబర్ 24): రిలయన్స్ స్టేడియం (వడోదర)
  • మూడో వన్డే (డిసెంబర్ 27): రిలయన్స్ స్టేడియం (వడోదర)

లైవ్ స్ట్రీమింగ్:

భారత క్రికెట్ అభిమానులు మ్యాచ్ లను Sports18 1 HD, Sports18 2 TV ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు తిలకించవచ్చు. డిజిటల్ గా Jiocinema అప్లికేషన్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు.

ALSO READ | ZIM vs AFG: అంపైర్‌ను అవమానించేలా చర్యలు.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్‌కు షాకిచ్చిన ఐసీసీ