- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
మరికల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నారాయణపేట జిల్లాలో ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని అప్పంపల్లి, మరికల్లో నిర్వహిస్తున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో 61 శాతం సర్వే పూర్తయ్యిందని ఎంపీడీవో కొండన్న ద్వారా తెలుసుకున్న కలెక్టర్ రెండు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.
జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వరకు 65 శాతం పూర్తయిందని, కొన్ని మండలాల్లో సర్వే అసంపూర్తిగా ఉందని, వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జ్యోతిని కోరారు. పంచాయతీ కార్యదర్శులు శ్యాంసుందర్‌రెడ్డి, జ్యోతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.