న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నడిపే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌కు రూ.1,062 కోట్ల నష్టం ప్రకటించింది. ఆపరేటింగ్ లీజుల ఖర్చులు పెరగడమే నష్టాలకు ప్రధాన కారణమని తెలిపింది. గత ఏడాది కూడా సెప్టెంబరు క్వార్టర్‌లో ఈ కంపెనీకి రూ.651 కోట్ల నష్టం వచ్చింది. అయితే ఇదే కాలానికి మొత్తం ఆదాయం మాత్రం 31 శాతం పెరిగి రూ.8,539 కోట్లకు చేరింది. గత సెప్టెంబరు క్వార్టర్‌లో రూ.6,541 కోట్లు సంపాదించింది. తాజా క్వార్టర్‌లో పన్నుకు ముందు రూ.1,031 కోట్ల నష్టం వచ్చింది. క్యాపిటలైజ్డ్ ఆపరేటింగ్ నష్టాల విలువ రూ.428 కోట్లుగా రికార్డయింది. మెయింటెనెన్సు వ్యయాల విలువ రూ.3,190 కోట్లకు చేరిందని ఇండిగో తెలిపింది.

