రూ.899కే ఫ్లైట్ టికెట్..ఇండిగో స్పెషల్ ఆఫర్

రూ.899కే ఫ్లైట్ టికెట్..ఇండిగో స్పెషల్ ఆఫర్

న్యూఢిల్లీ: ‘ది బిగ్‌ ఫ్యాట్‌ ఇండిగో సేల్‌’ పేరుతో బడ్జెట్‌ క్యారియర్ ఇండిగో  స్పెషల్‌ సేల్‌ ప్రకటించింది. ఈ ఫ్లాష్‌ సేల్‌లో భాగంగా విమాన టికెట్లను రూ.899 నుంచి అమ్ముతున్నట్టు తెలిపింది. ఇంటర్నేషనల్‌ ఫ్లైట్ల టికెట్ల ధరలు రూ.2,999ల నుంచి మొదలవుతాయి. కన్వీనియెన్స్‌ ఫీజును కూడా వసూలు చేయడం లేదని కంపెనీ తెలిపింది. పన్నులన్నీ కలిపే ఈ ధరలను నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నెల 23 నుంచి 26 వరకు ఈ ఆఫర్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వచ్చే జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ప్రయాణాలకు ఈ చౌక ధరలతో టికెట్లు కొనుక్కోవచ్చు. అయితే, ఇండిగో వెబ్‌సైట్‌, యాప్‌తో బుక్‌ చేసిన టికెట్లకు మాత్రమే జీరో కన్వీనియెన్స్‌ ఫీజు ఉంటుంది. గ్రూప్‌ బుకింగ్‌లకు ఈ రేట్లు వర్తించవని ఇండిగో తెలిపింది. ఇదిలా ఉంటే క్లియర్‌ట్రిప్‌ కూడా సంవత్సరం ముగింపును పురస్కరించుకొని స్పెషల్‌ ఆఫర్లను ప్రకటించింది. డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ బుకింగ్స్‌పై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తామని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌కార్డులతో బుక్‌ చేసేవారికి ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయి. కస్టమర్లకు పేబ్యాక్‌ పాయింట్లను అందజేయడానికి క్లియర్‌ట్రిప్‌ పేబ్యాక్‌ ఇండియాతో ప్రత్యేక ఒప్పందమూ చేసుకుంది. ఈ పాయింట్లను తదుపరి బుకింగ్‌కు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.