మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఇండియా రెండు వికెట్లు కోల్పోయి గెలిచింది. కెప్టెన్ అజింక్యా రహానే 27,శుబ్ మన్ గిల్ 35 పరుగులు చేయడంతో ఇంకా ఒక రోజు ఉండగానే విజయాన్ని తనఖాతాల్లో వేసుకుంది. దీంతో 4 మ్యాచ్ ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్133/6 వికెట్లతో నాల్గో రోజు ఆట మొదలు పెట్టిన ఆసిస్ 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా 69 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్ 3,బుమ్రా 2 ,అశ్విన్ 2, జడేజా 2, ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ పడ్డాయి.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్..195, రెండో ఇన్నింగ్స్ 200
భారత్ తొలి ఇన్నింగ్స్ ..326, రెండో ఇన్నింగ్స్ 70/2
