జోరు సాగాలె..నేడు బంగ్లాదేశ్‌‌‌‌తో ఇండియా రెండో టీ20

  • రా. 7 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌18, జియో సినిమాలో లైవ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  సొంతగడ్డపై తిరుగులేని ఆట చూపెడుతున్న  టీమిండియా మరో సిరీస్‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని జట్టు బుధవారం జరిగే రెండో టీ20లోనూ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పని పట్టేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ పట్టేయడంతో పాటు మరికొందరు కుర్రాళ్లను పరీక్షించాలని చూస్తోంది. పలువురు స్టార్ ప్లేయర్లు, సీనియర్లకు రెస్ట్ ఇచ్చి కుర్రాళ్లతో బరిలోకి దిగినప్పటికీ గ్వాలియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా తిరుగులేని ఆట చూపెట్టింది. 

ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు సంజు శాంసన్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాడని కెప్టెన్ సూర్య ముందుగానే చెప్పాడు.తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 29 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన శాంసన్‌‌‌‌‌‌‌‌ ఈసారి మరింత మెరుగ్గా ఆడి జట్టులో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. గత పోరులో రనౌటై నిరాశ పరిచిన యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. గ్వాలియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం చేసిన పేసర్ మయాంక్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నారు. 

వీళ్లపై మరోసారి అందరి దృష్టి ఉండనుంది. తుది జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కుతుందేమో చూడాలి. దాదాపు టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడిన సీనియర్లతో కూడిన  జట్టుతో బరిలోకి దిగినప్పటికీ మొదటి టీ20లో  బంగ్లా ప్రభావం చూపలేకపోయింది. లిటన్ దాస్‌‌‌‌‌‌‌‌, మహ్ముదుల్లా తదితరులు మెరుగ్గా ఆడితేనే ఆతిథ్య జట్టుకు కనీసం పోటీ అయినా ఇవ్వగలదు.