PSLV -C60 సక్సెస్..కొత్త ఆవిష్కరణలతో న్యూ ఇయర్కు ఇస్రో గ్రాండ్​వెల్కమ్..

ఇస్రో ఖాతాలో మరో సక్సెస్​..డిసెంబర్ 30,2024న  PSLV -C60 రాకెట్​ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే..ఈ విజయం సంక్లిష్ట అంతరిక్ష టెక్నాలజీ పరిజ్ఞానాన్ని సంపాదించడంలో పెరుగుతున్న ఇస్రో సామర్థ్యాలను నొక్కిచెప్పడమే కాకుండా భారతదేశ అంతరిక్ష ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ పరిశ్రమల పాత్రను హైలైట్ చేస్తుంది.

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయి..

డిసెంబర్​ 31, 2024న ఇస్రో ప్రయోగించిన PSLV c60 రాకెట్ ప్రయోగం సక్సెస్​ అయింది. రెండు స్పాడెక్స్​ ఉపగ్రహాలు SCX01( చాజర్​), SDX02(టార్గెట్​) లను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఒక్కొక్కటి 220 కిలోలు  బరువున్న ఈ రెండు ఉపగ్రహాలు భవిష్యత్తులో మానవ సహిత మిషన్లు, ఉపగ్రహ సేవలు , అంతర్ గ్రహ అన్వేషణకు కీలకమైన అటానమస్ రెండెజౌస్ , డాకింగ్ వంటి కీలకమైన స్పేస్​ టెక్నాలజీకోసం రూపొందించబడ్డాయి. 

SPADEX ఉపగ్రహాలను 475 కిమీ వృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా మోహరించడం ఇస్రోకి కీలకం విజయం. ఇది అంతరిక్ష డాకింగ్ టెక్నాలజీని మాస్టరింగ్ చేయడంలో భారతముందడుగును సూచిస్తుంది.