దమ్ముంటే చదివించండీ : నర్సరీ, PP1, PP2 ఫీజుల మోత మోగనుంది.. ఐదేళ్లలో మూడు రెట్లు హైక్

ఒక సాధారణ మధ్య తరగతి ఉద్యోగిని లేదా వ్యక్తిని మీ సంపాదనలో దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అడగండి.. ఈ ప్రశ్నకు దాదాపు అందరూ చెప్పే సమాధానం.. తమ సంపాదన అంతా పిల్లల చదువులకే అయిపోతుందని అంటారా లేదా.  ఖచ్చితంగా పిల్లలు ఉన్నవాళ్లు చెప్పే ఆన్సర్ ఇదే అయ్యుంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు ఏ పేరెంట్ కైనా అత్యంత ముఖ్యమైన అంశం తమ పిల్లల చదువులు. 

అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్ లో భలే డిమాండు ఉన్నది ప్రి స్కూలింగ్. అంటే 1వ తరగతికి ముందే పిల్లలను చదివించడం. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు కొంత ముందునుంచే పిల్లలను బడికి పంపించాలనే ధోరణి ప్రతి తల్లిదండ్రుల్లో పెరిగి పోయింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మొదలైన ప్రి స్కూలింగ్ కోసం చాలా ఖర్చు చేస్తున్నారు పేరెంట్స్. త్వరలో నర్సరీ, PP1, PP2 ఫీజుల మోత మోగనుంది. ఈ వార్త పేరెంట్స్ కు కొంచెం ఆందోళన కలింగించేదే అయినా.. నిజం.. మరో ఐదేళ్లలో ఫీజుల మోత మోగనుంది. ఒక్కో ఏడాది కొంత పెరుగుతూ.. మూడింతలు దాటే అవకాశం ఉందని ఇటీవల నేషనల్ ప్రీస్కూలింగ్ రిపోర్టు వెళ్లడించింది.

అయితే.. ఈ ప్రి స్కూలింగ్ మార్కెట్ 2034 వరకు మూడింతలు కానుందట. ప్రస్తుతం 2023 లో రూ. 400 కోట్ల మార్కెట్, 2034లో రూ.1000 కోట్లు దాటనుందని ఇండియన్ ప్రిస్కూల్ మార్కెట్ రిపోర్టు అంచనా వేసింది. అంటే ఇప్పుడు ఎవరైనా తమ పిల్లలకు ప్రిస్కూలింగ్ కోసం రూ.10  ఖర్చు చేస్తే మరో ఐదారేళ్లలో రూ.30 నుంచి రూ40. వేలకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట.

Also Read :- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్

మారుతున్న పేరెంట్స్ మైండ్ సెట్:

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు తమకంటే మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి చదువులు చెప్పించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలకు మంచి ఫౌండేషన్ వేయకుంటే వెనకబడి పోతారని అనుకుంటున్నారు. అందుకోసం తమ సంపాదనలో ఎక్కువ భాగం పిల్లల చదువులకే కేటాయిస్తున్నారు. రెండేళ్లు నిండన వెంటనే ప్రి స్కూలింగ్ లో జాయిన్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం మెట్రో పాలిటన్ సిటీలో బాగా ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ.. టయర్ 1, టయర్ 2 సిటీస్ లో కూడా పేరెంట్స్ అలవాటు పడుతున్నారు. అంటే జిల్లా కేంద్రాలు, టౌన్ లు మొదలైన వాటిలో కూడా పేరెంట్స్ ఈ ధోరణికి అలవాటు పడుతున్నారు. 

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రభావం:

పిల్లలకు ప్రిస్కూలింగ్ ఇప్పించడంలో పేరెంట్స్ ఒకరి నుంచి ప్రభావితం అవుతున్నారు. అదే విధంగా విద్యా సంస్థల ప్రభావం కూడా పేరెంట్స్ పై పడుతోంది. దీనికి తోడు కేంద్రం 2020లో తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఒక కారణం. దీని ప్రకారం ప్రతి తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించాలని, పిల్లలకు చిన్ననాటి నుంచే ఫౌండేషన్ వేయించాలని సూచించడం. దీనితో ప్రపంచంలోనే విద్యా రంగంలో ముందు వరుసకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో తెచ్చిన చట్టం ప్రకారం పిలల్ల తప్పని సరి స్కూలింగ్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. 

ప్రి స్కూలింగ్ లో ఏఐ, డిజిటల్ ప్రభావం:

కరోనా పాండెమిక్ తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ అమాంతం పెరిగి పోయింది. ఆ సందర్భంగానే చాలా వరకు విద్యారంగం డిజిటలీకరణను అందిపుచ్చుకున్నాయి. దానికితోడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో స్కూళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వీటి వలన విద్యార్థుల లెర్నింగ్ పద్ధతులే మారిపోయాయి. దీనికితోడు వివిధ స్కూళ్లు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ ఆకర్షించడం మొదలుపెట్టాయి. అందుకు అనుగుణంగానే సాంకేతిక మార్పులు చేసుకొని అంతర్జాతీయ స్తాయిలో విద్యను అందిస్తున్నాయి. వెరసి.. ఇండియాలో ప్రిస్కూలింగ్ బూమ్ ఎక్కువ కావడంతో పాటు.. పెద్ద మార్కెట్ గా రూపాంతరం చెందింది.