ఇండియాకు ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష..నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • ఒత్తిడిలో టీమిండియా
  • ఉ. 7.50 నుంచి  స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అగ్ని పరీక్షకుసిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభావం తర్వాత డీలా పడిన ఇండియా తమ నాయకుడు రోహిత్ శర్మ లేకుండానే బోర్డర్– గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని ఆరంభించనుంది. ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదలయ్యే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌ను ఢీకొట్టనుంది. 2018–19, 2020–21లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని గెలుకున్న ఇండియా క్రికెట్‌‌లో  ఏదీ అసాధ్యం కాదని నిరూపించింది. ఆ విజయాలతో  టెస్టుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 

ముచ్చటగా మూడోసారి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్  ఫైనల్ చేరాలని++ ఆశించిన టీమిండియా గత నెలలో న్యూజిలాండ్ కొట్టిన దెబ్బతో నేలకు దిగింది. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 4–0తో ఓడించాల్సిన పరిస్థితిలో నిలిచిన ఇండియా  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, మహ్మద్ షమీ, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ వంటి ముగ్గురు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు లేకుండా... పలువురు కుర్రాళ్లపై నమ్మకం ఉంచి మొదటి టెస్టులో పోటీకి రెడీ అయింది.  రెండోసారి తండ్రయిన కారణంగా రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి టెస్టుకు దూరం అవ్వడంతో పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 

కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పరాజయం తర్వాత డీలా పడిన జట్టులో తిరిగి ఆత్మవిశ్వాసం నింపే బాధ్యత ఇప్పుడు అతనిపై ఉంది. మరోవైపు స్వదేశంలో వరుసగా రెండు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే లక్ష్యంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఆట ఆ జట్టుకు ప్లస్ పాయింటే అయినా.. ఇండియా మాదిరిగా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే పెర్త్ పేస్ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఇండియా ఆటగాళ్లకు కత్తిమీద సామే కానుంది. 

బ్యాటింగ్‌‌లో ‘కంగారూ’

ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతోంది. ఇండియాతో పోలిస్తే ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొన్ని సమస్యలు ఉన్నాయి.  ప్రస్తుత  డబ్ల్యూటీసీ సైకిల్ లో స్టీవ్ స్మిత్ సగటు 36 మాత్రమే కాగా.. మార్నస్ లబుషేన్ సగటు గత రెండేండ్లలో 30కి కంటే తక్కువకు పడిపోయింది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సెంచరీలతో ట్రావిస్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా పాలిట విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాడు. కానీ, ఈ డబ్ల్యూటీసీలో అతని బ్యాటింగ్ సగటు కూడా (28) తక్కువగానే ఉంది. ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖవాజా నిలకడగా రాణిస్తుండగా.. 

అలెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారీ, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బుమ్రా, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది. ఇండియా మాదిరిగా ఆసీస్ కూడా నేథన్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీని– ఖవాజా రూపంలో కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగుతోంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరుగులేదు. కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగ్గురూ వరల్డ్ క్లాస్ పేసర్లు కాగా.. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తడబడుతున్న ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇబ్బంది పెట్టేందుకు నేథన్ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ గా ఉన్నాడు. 

కోహ్లీపై బాధ్యత..కుర్రాళ్లపై భారం..

ఆస్ట్రేలియా గడ్డపై ఆట  ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎప్పుడూ సవాలే. ఇక్కడి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మన ఆటగాళ్ల తలరాతను మార్చిన సందర్భాలు ఉన్నాయి. 1991–-92లో  వాకా స్టేడియంలో కఠినమైన పిచ్‌‌పై సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ కొట్టి ఔరా అనిపిస్తే... వెంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ టెస్టు కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించాల్సి వచ్చింది. 2014లో నాలుగు సెంచరీలు సాధించిన విరాట్.. ‘కింగ్ కోహ్లీ’గా పేరు గడిస్తే.. గత టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుజారా, పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుత బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురొడ్డి జట్టును గెలిపించారు. కోహ్లీ, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్న రోహిత్ ప్రస్తుతం తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో ఉన్నారు. 

ప్రతికూల ఫలితం వస్తే వాళ్లకిదే చివరి టెస్టు సిరీస్ అయినా ఆశ్చర్యం ఉండబోదు. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైర్హాజరీలో పెర్త్‌‌లో యశస్వితో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రానున్నాడు. కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫెయిలైనా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణిస్తే యశస్వి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరుగుండదు.  గిల్ స్థానంలో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యంత అనుభవజ్ఞుడైన కోహ్లీ బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. 

సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ ఉన్నా మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధ్రువ్ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగే చాన్సుంది. పేస్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలుగు కుర్రాడు అరంగేట్రం ఖాయమే.  తమకు లభించిన ఈ అద్భుత అవకాశాన్ని  కుర్రాళ్లు ఒడిసిపట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. స్పిన్నర్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది జట్టులో ఉండనుండగా.. బుమ్రాకు తోడుగా సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. కానీ,  ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన హర్షిత్ రాణా కూడా తుది జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 

మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎవరికి ఓటు వేస్తుందో చూడాలి. గత టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి టెస్టులో 36 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలి చిత్తయినా.. పలువురు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయినా  గొప్పగా పుంజుకున్న ఇండియా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. అదే మాదిరిగా కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో అవమానం తర్వాత కంగారూ గడ్డపై ఈసారి కూడా ఇండియా అద్భుతం చేస్తుందేమో చూడాలి.

తుది జట్లు (అంచనా)

ఇండియా : యశస్వి జైస్వాల్,  రాహుల్,  దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ,  రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్,  అశ్విన్,  నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్‌‌ కృష్ణ,  మహ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్,  బుమ్రా (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌).
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీని, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టీవ్ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ట్రావిస్ హెడ్,  మిచెల్ మార్ష్,  అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నేథన్ లైయన్, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్.

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వాతావరణం

పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంచి పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించి బౌలర్లకు అనుకూలించనుంది. గత రెండు రోజుల్లో అనూహ్యంగా వర్షం కురిసింది. గురువారం మాత్రం మంచి ఎండ వచ్చింది. మ్యాచ్ జరిగే రోజుల్లో వర్ష సూచన లేదు.